Saturday, April 20, 2024

ర్యాలీలు,రోడ్డు షోలు,పాద‌యాత్ర‌ల‌కి నో ప‌ర్మిష‌న్

ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల షెడ్యూల్ ని ప్ర‌క‌టించారు ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ సుశీల్ చంద్ర‌. క‌రోనా వ్యాపిస్తోన్న నేప‌థ్యంలో ప‌లు ఆంక్ష‌లు విధించారు. జనవరి 15వ తారీఖు వరకు ఇలాంటి పొలిటికల్ ర్యాలీలు, రోడ్డు షో లు, పాదయాత్రలు, సైకిల్ ర్యాలీ ల కు అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. నామినేషన్ వేసేందుకు కూడా యాత్రగా వెళ్లవద్దని ఆదేశించారు. జనవరి 15వ తేదీ తర్వాత అప్పటి పరిస్థితులను బట్టి తదుపరి నిర్ణయం ప్రకటిస్తామని ఆయన వివరించారు. డోర్ టు డోర్ క్యాంపెయిన్ కోసం ఐదుగురు కంటే ఎక్కువ మంది వెళ్ళకూడదని చెప్పారు. ఈ రూల్స్ ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉత్తర ప్రదేశ్ 403, మణిపూర్ 70 , గోవా 60, పంజాబ్ 117, ఉత్తరంఖడ్ 40 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు వివరించారు ఎన్నికల కమిషన్.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement