Thursday, April 25, 2024

మంచు ఉప్పెన‌.. ఎనిమిది మంది మృతి

మంచు ఉప్పెన రావ‌డంతో ఎనిమిది మంది మృతి చెందారు. మంచు ఉప్పెన టిబెట్‌లోని నైరుతి ప్రాంతాన్ని ముంచెత్తింది. మెయిన్లింగ్‌ కౌంటీలోని పాయ్‌, మెడోగ్‌ కౌంటీలోని డోక్సాంగ్‌ ప్రాంతాల మధ్య ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఈ మంచు ఉప్పెనలో ప్రజలు, వాహనాలు చిక్కుకుపోయినట్లు తెలిపింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. మంచు ఒక్కసారిగా ఉప్పెనలా రహదారిపైకి వచ్చినట్లు తెలిపింది. మంచు ఉప్పెనలో చిక్కుకుపోయిన వారి కోసం చైనా ప్రభుత్వం గాలింపు చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఘటనాస్థలానికి 246 మంది సహాయక సిబ్బందిని పంపించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. శీతాకాలంలో.. రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. అలాంటి సమయంలోనే అక్కడక్కడా అవలాంచ్‌లు ఏర్పడతాయి. భారీ ఎత్తున మంచు ఒక్కసారిగా విపరీతమైన వేగంతో కొండలపై నుంచి కిందకు రావడాన్ని అవలాంచ్‌ (మంచు తుపాను) అంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement