Thursday, April 18, 2024

ED: హైదరాబాద్​ క్రిప్టోకరెన్సీ ఎక్చేంజ్​పై ఈడీ దాడులు.. ఫెమా రూల్స్​ ఉల్లంఘించారని కేసు

ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) హైదరాబాద్ యూనిట్ గురువారం క్రిప్టో కరెన్సీ మార్పిడి కంపెనీకి చెందిన ఆఫీసుపై దాడి చేసింది. ఈ కంపెనీ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) కింద నిబంధనలను ఉల్లంఘించిందన్న ఆరోపణలున్నాయి. అంతేకాకుండా మనీలాండరింగ్ ఆరోపణలపై కూడా ED అభియోగాలు మోపింది. గతంలో వీరికి షోకాజ్ నోటీసు జారీ చేసినట్టు ఈడీ అధికారులు తెలిపారు. ఈ దాడికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ వారంలో కేంద్ర ఏజెన్సీ అయిన ఈడీ 12 నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, వాటికి సంబంధించిన ఫిన్‌టెక్ కంపెనీలకు చెందిన రూ.105 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. విచారణ ఆధారంగా పైన పేర్కొన్న కంపెనీలన్నీ మైక్రో ఫైనాన్స్ రుణాలతో సంబంధం కలిగి ఉన్నాయని ED ఎంక్వైరీలో తెలిసింది. 4,430 కోట్ల మొత్తం పంపిణీ చేసినట్టు కనుగొన్నారు. వీటిలో ఎక్కువ భాగం తక్షణ వ్యక్తిగత రుణాలతో వ్యవహరించే ఫిన్‌టెక్ కంపెనీల ద్వారా నిధులు సమకూర్చినట్టు తెలుస్తోంది. NBFCలు, ఫిన్‌టెక్ సంస్థలు 819 కోట్ల రూపాయల లాభాలను ఆర్జించాయని ఈడీ అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement