Sunday, October 17, 2021

తాటాకు చప్పుళ్లకు లొంగే వ్యక్తిని కాదు: టీఆర్ఎస్ కు ఈటల వార్నింగ్

హుజురాబాద్ ఉప ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. టి ఆర్ ఎస్ వర్సెస్ బిజెపి గా రాజకీయం సాగుతోంది. ఈ క్రమంలో మాటల తూటాలు పేలుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో గెలుస్తామనే నమ్మకం లేకే సీఎం కేసీఆర్… కుట్రలు, కుతంత్రాలకు తెరలేపారని ఆరోపించారు. తన టక్కుటమార విద్యలన్నింటిని హుజూరాబాద్ లో ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ గిమ్మిక్కులు చెల్లవన్న ఈటల.. హుజూరాబాద్ లో మీటింగులకు ఇతర నియోజకవర్గాల నుంచి ప్రజలను రప్పించి అందరినీ అయోమయానికి గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈటలను ఓడిస్తే మరో 20 ఏళ్లు తెలంగాణను బానిసత్వంలో ఉంచవచ్చనేది కేసీఆర్ ఆలోచన అని విమర్శించారు. తనను ఎదుర్కొనే దమ్ము లేకే… తనపై భూ ఆక్రమణ ఆరోపణలు చేశారని మండిపడ్డారు. ఒక్క ఎకరం ఆక్రమించుకున్నా ముక్కు నేలకు రాస్తానని తన భార్య సవాల్ చేస్తే ఇంతవరకు కేసీఆర్ నుంచి స్పందనే లేదని గుర్తు చేశారు. హరీశ్ రావు అన్నీ అబద్ధాలే చెపుతున్నారని విమర్శించారు. ఒకప్పుడు హరీశ్ పై ఎంతో గౌరవం ఉండేదని… మామకు పూర్తిగా బానిస అయి, ఇప్పడు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు తాటాకు చప్పుళ్లకు లొంగే వ్యక్తిని తాను కాదని ఈటెల స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News