Friday, March 29, 2024

ఈటలది డ్రామానా? కౌశిక్ ఓవర్ యాక్షనా?!

హుజురాబాద్ లో ఎన్నికల హడావిడి కనిపిస్తోంది. ఉప ఎన్నిక టీఆర్ఎస్, బీజేపీ పార్టీలను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. గెలుపు కోసం బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ పాదయాత్ర మొదలు పెడితే… టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నియోజవకర్గ అభివృద్ధి, దళిత బంధు అంటూ కోట్లు కుమ్మరిస్తున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎవరు ఉంటారు అనేదానిపై ఇంకా స్పష్టత రాకపోయినా… ఈటలపై మాటల దాడికి మాత్రం కొనసాగిస్తున్నారు.

ప్రజా దీవేన యాత్ర మొదలు పెట్టిన ఈటల నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. గత 12 రోజులుగా దాదాపు 222 కిలో మీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఈ క్రమంలో స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో డాక్టర్ల సలహా మేరకు పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. అయితే, ఇదంతా ఓ పెద్ద డ్రామా అని టీఆర్ఎస్ విమర్శలు మొదలు పెట్టింది. దిగజారుడు రాజకీయాలకు ప్రతీక బీజేపీ, దగా కోరు రాజకీయాలకు నిలువుటద్దం ఈటల రాజేందర్ అంటూ టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.’’ ఈ దిగజారుడు పార్టీ,దగాకోరు రాజేందర్ ల ఆధ్వర్యంలో మొదలయిన ఇలాంటి డ్రామాలు, నాటకాలు హుజురాబాద్ ప్రజలు ఇంకెన్ని చూడాల్సి ఉందొ? ఈటల రాజేందర్ త్వరగా కోలుకోవాలి ‘’ అని కౌశిక్  వ్యాఖ్యానించారు.  

హుజురాబాద్ ఉప ఎన్నికల బరిలో ఈటలకు ప్రత్యర్థిగా టీఆర్ఎస్ తరపున పాడి కౌశిక్ రెడ్డి దిగబోతున్నారని ప్రచారం జరుగుతోంది. కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ లో ఉండగా… టీఆర్ఎస్ టికెట్ తనకే అంటూ మాట్లాడిన ఆడియో వైరల్ అవ్వడం అందరికీ తెలిసిందే. అనంతరం జరిగిన పరిణామాలతో ఆయన కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. టికెట్ ఆయనకే ఖరారు చేశారా? అన్నది క్లారిటీ లేదు. అయితే, ఈటల పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో టీఆర్ఎస్ అలర్ట్ అయ్యింది. ఈ క్రమంలో ఈటల బావమరిది వాట్సాప్ చాట్ బహిర్గతం అయ్యాయి. అయితే, దీనిని ఈటల వర్గం గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. తాజాగా ఈటల పాదయాత్రకు బ్రేక్ పడడంతో టీఆర్ఎస్ దీనిని విమర్శనాస్త్రంగా ఎంచుకుంది. దళిత బందు ఓ ఎన్నికల స్టంట్ అంటూ బీజేపీ… ఈటల దళిత వ్యతిరేకి అంటూ టీఆర్ఎస్.. ఒకరిపై మరొకరు ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు. దీంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు.

ఇది కూడా చదవండిః బోర్డుల పరిధిలో కార్యాచరణకు సై.. రెండు రాష్ట్రాలతో చర్చ

Advertisement

తాజా వార్తలు

Advertisement