Thursday, April 25, 2024

చైనాలో భూకంపం రిక్ట‌ర్ స్కేలుపై 6.6గా న‌మోదు

చైనాలోని వాయ‌వ్య‌ప్రాంతం కింఘాయ్ పావిన్స్ లో భూకంపం చోటు చేసుకుంది. రిక్ట‌ర్ స్కేలుపై 6.6తీవ్ర‌త న‌మోదైన‌ట్టు అమెరికా జియోలాజిక‌ల్ స‌ర్వే ప్ర‌క‌టించింది. కాగా 1.46గంట‌ల‌కు ఈ భూకంపం వ‌చ్చింద‌ట‌. భూమికి 10కిలోమీట‌ర్ల లోతులో దీని కేంద్రం ఉన్న‌ట్లు పేర్కొంది. ఇక్సింగ్ పట్టణానికి 140 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది. ఆ తర్వాత కూడా 5.1 తీవ్రతతో మరో భూకంపం సంభవించినట్టు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. చైనా భూకంప నెట్ వర్క్ సెంటర్ ప్రకారం.. భూకంప తీవ్రత 6.9 గా ఉన్నట్టు స‌మాచారం. ప్రాణనష్టం తక్కువగా వుండచ్చని అమెరికా జియోలాజికల్ సర్వే అంచనా వేసింది. కాకపోతే భారీ నష్టం ఏర్పడొచ్చని చెప్పింది. ఈ ప్రాంతంలోని నివాసాలు భూకంపాలకు కదిలిపోయే ప్రమాదం ఉందని తెలిపింది. 2010లో ఇదే కింఘాయ్ ప్రావిన్స్ లో వచ్చిన భూకంప తీవ్రతకు సుమారు 3,000 మంది మరణించినట్టు రికార్డులు చెబుతున్నాయి. మిగ‌తా వివ‌రాలు తెలియాల్సి ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement