Thursday, April 25, 2024

మేఘాలయలో భూకంపం.. తీవ్రత 3.4గా నమోదు..

మేఘాలయలో ఈరోజు తెల్లవారుజామున 3.46 గంటల సమయంలో భూకంపం వచ్చింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 3.4గా నమోదయ్యాయని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (NCS) తెలిపింది. తురాకు 37 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది. భూపొరల్లో 5 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని పేర్కొన్నది. ఇదిలా ఉండగా బుధవారం తెల్లవారుజామున అరుణాచల్‌ప్రదేశ్‌లో భూమి కంపించగా, నేడు మేఘాలయలో ప్రకంపణలు చోటుచేసుకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement