Friday, April 19, 2024

అండ‌మాన్ లో భూకంపం.. తీవ్ర‌త 5.0గా న‌మోదు

గ‌త కొన్ని రోజుల నుంచి ప్ర‌పంచ‌వ్యాప్తంగా వరుసగా భూకంపాలు వ‌స్తున్నాయి. టర్కీ, సిరియాలో భూకంపాలు సంభవించిన తర్వాత పలు చోట్ల రోజులు, గంటల వ్యవధిలోనే భూప్రకంపనలు సంభవించాయి. తాజాగా అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.0 గా నమోదైంది. నికోబార్ దీవుల రీజియన్ లో ఈరోజు ఉదయం 5 గంటలకు కొద్ది సెకన్ల పాటు భూమి కంపించింది. భూకంపాన్ని నేషనల్ సెంట్ ఫర్ సిస్మోలజీ ధృవీకరించింది. నికోబార్ దీవుల్లోని పెర్కాకు 208 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని తెలిపింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు చోటు చేసుకున్నాయని వెల్లడించింది. దీని ప్రభావంతో ఇండోనేషియాలో కూడా భూకంపం వచ్చిందని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement