Thursday, March 28, 2024

కూలిన శిథిలాల కింద ప్రసవం.. దీన‌స్థితిలో ప‌సికందు

ట‌ర్కీ..సిరియాలో ఘోర విపత్తులో మరో హృదయ విదారకర ఘటన జరిగింది. నిండుచూలాలు.. కూలిన భవనంలో చిక్కుకుపోయింది. పురిటినొప్పులతో శిథిలాల కింద అల్లాడిపోయింది. బిడ్డకు జన్మనిచ్చింది. కానీ ప్రసవం కాగానే కన్నుమూసింది. సిరియాలోని అలెప్పోలో జరిగిందీ ఈ ఘటన.కాగా శిథిలాలను తొలగిస్తున్నప్పుడు శిశువును గమనించారు స్థానికులు. ఎంత సేపు అయిందో ఏమో.. చలనం లేని స్థితిలో అమ్మ.. చలిలో వణుకుతున్న పసికందు కనిపించారు. వెంటనే పిల్లాడిని తీసుకుని ఆసుపత్రికి తరలించారు స్థానికులు. శిథిలాల నుంచి చిన్నారిని బయటికి తీసుకొస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చూపరులకు కన్నీళ్లు తెప్పిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement