Saturday, April 20, 2024

ఈ-పాస్ వ్యవస్థను రద్దు చేసిన తెలంగాణ సర్కారు

తెలంగాణలో లాక్‌డౌన్‌ను పూర్తిస్థాయిలో ఎత్తివేయడంతో వాహన రాకపోకలకు సంబంధించిన ఈ-పాస్ వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసింది. ఆదివారం నుంచి ఈ-పాస్ లేకుండానే ఇతర రాష్ట్రాలకు చెందిన వాహనాలను పోలీసులు అనుమతించనున్నారు. తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు వాహనదారులు మాత్రం ఆయా రాష్ట్రాల నిబంధనలకు అనుగుణంగా రవాణా అనుమతులు పొందాలని అధికారులు సూచించారు.

కేసులు పెరిగితే మళ్లీ లాక్‌డౌన్
ప్రజల సౌలభ్యం, సాధారణ జనజీవనం కోసం లాక్‌డౌన్ ఎత్తివేసినట్లు శనివారం నాటి కేబినెట్ భేటీలో కేసీఆర్ వెల్లడించారు. మళ్లీ కరోనా కేసులు పెరిగి పరిస్థితి అదుపుతప్పితే.. మరోసారి లాక్‌డౌన్ విధించి, కఠిన ఆంక్షలు అమలు చేస్తామన్నారు. దీనిపై వెనకాడబోమని, తప్పనిసరి పరిస్థితుల్లో లాక్‌డౌన్ పెట్టడం వల్లే వ్యాధి నియంత్రణలోకి వచ్చిందన్నారు. అటు అనేక రంగాలపై ఇది ప్రభావం చూపిందని… ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement