Friday, March 29, 2024

డాక్ట‌ర్ శివ‌లాల్ ని స‌త్క‌రించిన – ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్

డ్రైవింగ్ లైసెన్స్ పొందిన మొట్ట మొద‌టి మ‌రుగుజ్జు వ్య‌క్తిగా రికార్డు సృష్టించాడు డాక్ట‌ర్ శివ‌లాల్. ఈయ‌న ఆహాలో ప్ర‌సారమ‌వుతోన్న హీరో బాల‌కృష్ణ హోస్ట్ చేసిన అన్ స్టాఫ‌బుల్ కి విచ్చేశాడు. కాగా ఇప్పుడు టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్ శాలువా, పుష్ప‌గుచ్చంతో స‌త్క‌రించారు. కాగా శివ‌లాల్ ప్ర‌తీ ఒక్క‌రికి స్ఫూర్తి దాయకంగా, రోల్ మాడల్ గా నిలుస్తారని చెప్పారు. హైద‌రాబాద్ బంజారాహిల్స్ లో నివసించే శివలాల్ తన ఎత్తకు సరిపడి కారు క్లచ్, బ్రేకులు ఏర్పాటు చేసుకుని మూడు నెలల పాటు ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. అధికారులను ఒప్పించి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం అభినందనీయం అని సజ్జనార్ అన్నారు. లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకున్న శివలాల్ భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు సృష్టించాలని కోరారు. ఈ మేరకు ఆయన శివలాల్ ప్రతిభను కొనియాడుతూ ట్వీట్ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement