Friday, March 29, 2024

‘దుర్గ’ చిత్రానికి లారెన్స్ డైరెక్ట‌ర్ కాద‌ట

న‌టుడిగా, ద‌ర్శ‌క నిర్మాత‌గా, కొరియోగ్రాఫ‌ర్ గా త‌న స‌త్తాని చాటుతున్నాడు రాఘ‌వ లారెన్స్. రీసెంట్ గా లారెన్స్ న‌టిస్తున్న చిత్రం దుర్గ‌. ఈ చిత్రం హార‌ర్ర్ మూవీ. ఈ ఏడాదిలోనే ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌ట‌. ఈ మ‌ధ్య‌కాలంలో హ‌ర‌ర్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా మారాడు లారెన్స్. ఇక ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ కూడా రీసెంట్ గా రిలీజ్ అయింది. ఈ ప్రాజెక్ట్ క‌రోనా వ‌ల్ల ఆల‌స్యం అవుతోంది. కాగా ఈ చిత్రానికి డైరెక్ట‌ర్ లారెన్స్ కాద‌ట‌..నిర్మాత‌గా మాత్ర‌మే ఉంటున్నాడ‌ని స‌మాచారం. కాగా క‌బాలి, కేజీఎఫ్ సినిమాల‌తో ఫైట్ మాస్ట‌ర్స్ గా పేరు సంపాదించుకున్న అన్బు-అరివు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నార‌ట‌.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement