Friday, December 1, 2023

ఓటీటీ బాట‌లో దుల్క‌ర్ స‌ల్మాన్..

మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ సైతం ఓటీటీ బాట పట్టారు. ‘ఫ్యామిలీమెన్‌’ ఫేం రాజ్‌ డీకే ద్వయంతో ఓ వెబ్‌సిరీస్‌లో నటించేందుకు సిద్ధమయ్యారు. దీనిని ఓటీటీ వేదిక నెట్‌ప్లిక్స్‌ కోసం రూపొందిస్తున్నారు. దీనికి ‘గన్స్‌ అండ్‌ గులాబ్స్‌’ అనే టైటిల్‌ ఖరారు చేసినట్లు సమాచారం. వినోదాత్మకంగా సాగే క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశంతో ఈ సిరీస్‌ రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఇందులో దుల్కర్‌తో పాటు బాలీవుడ్‌ నటుడు రాజ్‌కుమార్‌ రావు, ఆదర్స్‌ గోరవ్‌ నటిస్తున్నారు.

దీని చిత్రీకరణ త్వరలో మొదలుకానుంది. దుల్కర్‌ మహానటి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత ఆయన నటించిన పలు మలయాళ సినిమాలు తెలుగులో అనువాదం అయ్యాయి. అలాగే ప్రస్తుతం తెలుగులో హను రాఘవపూడి దర్శకత్వంలో లెప్టినెంట్‌ రామ్‌ (వర్కింగ్‌ టైటిల్‌) సినిమాలో నటిస్తున్నారు.

- Advertisement -
   

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..,

Advertisement

తాజా వార్తలు

Advertisement