Thursday, April 25, 2024

AI వాడకంలో దుబాయ్ దూకుడు.. అంత సెక్యూర్ కాదంటున్న నిపుణులు..

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE)కు ముఖ్యమైన సిటీ దుబాయ్‌ (DUBAI).. అయితే ఏడాది కాలంగా కొత్త కొత్త ప్రయోగాలు చేపడుతూ ప్రపంచాన్ని వావ్ అనిపిస్తోంది. విప్లవాత్మక సంస్కరణలతో దూసుకుపోతున్న దుబాయ్‌.. ఇప్పుడు మరో సాహసోపేతమైన చర్యలకు ఉపక్రమిస్తోంది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అంటే స్మార్ట్ ఫోన్ వాడుతున్న అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఈ టెక్నాలజీ అవసరం దాదాపు అన్నిరంగాల్లో అవసరం పడుతోంది. మనకు తెలియకుండానే వాడేస్తున్నాం కూడా..  ప్రైవేట్‌ రంగాల్లో దాదాపు ఏఐ సహకారం లేకుండా ముందుకు సాగడం లేదు.  అయితే.. ప్రభుత్వ రంగాలు మాత్రం పూర్తిస్థాయిలో ఏఐని ఉపయోగించుకునేందుకు ఆలోచిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం భద్రత (సెక్యూరిటీ). ఈ తరుణంలో దుబాయ్‌ సర్కార్‌ ఎట్లాంటి ఆలోచన చేయకుండా దూకుడు చూపుతోంది.

AI  టెక్నాలజీ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) వాడకం ఇప్పుడు చాలా స్పీడ్ ప్ అయ్యింది. అయితే దీని వాడకం వల్ల ప్రమాదం ఉందంటూ కొంతమంది ఆందోళన వెళిబుచ్చుతున్నారు. గోప్యత, పారదర్శకత, అసమానత, భద్రత.. ఈ అంశాలకు పెను సవాల్‌గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మారుతోందన్నది చాలామంది పరిశీలకుల అభిప్రాయం. గ్లోబల్ సైబర్ సెక్యూరిటీలో పుట్టుకొస్తున్న బెదిరింపులు, ఇతర పోకడలను సైతం గుర్తించింది కన్సార్టియం ఫర్ సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ రీసెర్చ్ (CSER) పరిశోధన. అంతేకాదు AI, డిజిటలైజేషన్, న్యూక్లియర్ వెపన్స్ సిస్టమ్‌ల తరపున ఎదురయ్యే ముప్పును సైతం ప్రస్తావించింది. ప్రధానమైన అంశాలు కావడం వల్లే అమెరికా లాంటి అగ్రరాజ్యాలు కూడా ఏఐను రక్షణ రంగంలో అన్వయింపజేసేందుకు ముందు వెనకా ఆలోచిస్తున్నట్టు నిపుణుల అభిప్రాయం.

క్లిక్ చేయండి: సంక్లిష్ట దశను దాటిన జేమ్స్‌వెబ్‌ టెలిస్కోప్.. విప్పారిన బంగారు నేత్రం..

- Advertisement -

వనరులను, మేధస్సును వాడుకోవడంలో దుబాయ్ అద్భుతాలు చేస్తోందనే చెప్పవచ్చు. అసలే టెక్నాలజీ కొత్తైన ఈ సిటీ.. అవసరం మేర మాత్రమే ఏఐను ఉపయోగించుకోవడంపై ఫోకస్‌ పెడుతోంది. ఆరోగ్యభద్రత, విద్య, రవాణా, ప్రజా భద్రత విషయంలో ఏఐ వంటి లెటెస్ట్ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా ఆచరణలోకి తీసుకొచ్చింది. ప్రజల దైనందిన జీవితంలోకి జొప్పించి.. అలవాటు చేయిస్తోంది. స్మార్ట్ దుబాయ్‌ ఆఫీస్‌ల సహకారంతో ఎన్నో వ్యూహాల నడుమ కార్యకలాపాల్ని నిర్వహిస్తోంది. ఏఐ, బ్లాక్‌చెయిన్‌ ద్వారా ప్రభుత్వ సేవల్ని అందించడమే కాకుండా.. జనాల ఫీడ్‌బ్యాక్‌ను సైతం తీసుకుంటోంది. తద్వారా ఎదురయ్యే పరిణామాల్ని ఎదుర్కొనేందుకు పటిష్ట వ్యవస్థను సిద్ధం చేసుకుంటోంది. వీటికి తోడు ఎథికల్‌ టూల్‌ కిట్స్‌ ద్వారా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తోంది. హైలెవల్‌ సర్వీసులు కావడంతో ఏఐ అల్గారిథమ్‌ పొరపచ్చాలతో తప్పులు దొర్లే అవకాశమూ లేకపోలేదు.  ఇందుకోసం భారీగా ఇంజినీర్లను నియమించుకుంటోంది దుబాయ్. 

ప్రపంచంలోనే ఫస్ట్ ఏఐ యూనివర్సిటీని ప్రారంభించిన అబుదాబి

కాగా, దుబాయ్‌ దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది. కానీ, ఆనందం అంటే కేవలం ఎక్కువ డబ్బును కలిగి ఉండడం కాదు. గ్లోబలైజ్డ్ వరల్డ్ లో కమ్యూనిటీతో ఎలా పొత్తు పెట్టుకోవాలి? సామాజిక అనుభవాన్ని మెరుగుపరచడానికి ఎలా పని చేయాలి? అనే విషయాలపైనే దుబాయ్‌ ఫోకస్‌ పెట్టింది. అలా దుబాయ్.. ఈ  భూమిపై అత్యంత సంతోషకరమైన నగరంగా స్థానం సంపాదించుకునే మార్గం వైపు వెళ్తున్నట్లు కనిపిస్తోందని ఆర్థిక మేధావులు అంచనా వేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్‌,  ట్విట్టర్    పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement