Friday, February 3, 2023

బూట్ల‌లో డ్ర‌గ్స్.. పోలీసుల‌కి షాక్ ఇచ్చిన డ్ర‌గ్ డీల‌ర్

అత‌నో డ్ర‌గ్ డీల‌ర్..అయితేనేం నిజాయితీకి నిలువెత్తు నిద‌ర్శ‌నంగా నిలిచాడు. వివ‌రాల్లోకి వెళ్తే.. ఓ డ్రగ్ డీలర్ తన బూట్లలో రూ. 20 కోట్ల విలువైన డ్రగ్స్ ఉన్నాయని చెప్పేసి తనలోని నిజాయతీని బయటపెట్టాడు. బ్రిటిష్ పోలీసులు తాజాగా విడుదల చేసిన వివరాల ప్రకారం.. గతేడాది మార్చి 31న రాత్రి పదిన్నర గంటల సమయంలో డ్రగ్ కొరియర్ కీరన్ గ్రాంట్ ప్రయాణిస్తున్న స్కోడా ఫాబియా కారును ఎసెక్స్ పోలీసులు ఆపారు. తనిఖీల అనంతరం దానికి బీమా లేదని గుర్తించారు. కారు దిగిన 40 ఏళ్ల కీరన్ గ్రాంట్‌ను కారులో ఇంకేమైనా ఉన్నాయా అని పోలీసులు ప్రశ్నించారు. దీంతో అతడు మరోమాటకు తావులేకుండా, ఏమాత్రం తడుముకోకుండా తన బూట్లలో రూ. 20 కోట్ల విలువైన డ్రగ్స్ ఉన్నాయని చెప్పాడు. అది విన్న పోలీసులు షాకయ్యారు. ‘‘బూట్లలోనా అని ప్రశ్నించారు. దానికి అతడు తాపీగా అవునని సమాధానం ఇచ్చాడు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement