Saturday, April 20, 2024

డ్ర‌గ్స్ ముఠా అరెస్ట్ – కొకెన్ , హెరాయిన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు

డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేస్తున్న ముంబ‌యి గ్యాంగ్ ను హైద‌రాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల కోసం ఈ డ్ర‌గ్స్ ని హైద‌రాబాద్ తీసుకువ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ముగ్గురు స‌భ్యుల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వ‌ద్ద నుండి కొకైన్, హెరాయిన్ తో పాటు ప‌లు మ‌త్తు ప‌దార్థాల‌ను పోలీసులు సీజ్ చేశారు. ముంద‌స్తు స‌మాచారం మేర‌కు ఉత్త‌ర‌, ప‌శ్చిమ మండ‌ల టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్త ఆప‌రేష‌న్ నిర్వ‌హించి ఈ డ్ర‌గ్స్ ముఠా గుట్టు ర‌ట్టు చేశారు. కేసు న‌మోదు చేసి పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement