Thursday, April 18, 2024

అక్రమార్కులకు అడ్డాగా ఎయిర్​పోర్టులు.. రెండేళ్లలో 405 కోట్ల విలువైన 833కిలోల బంగారం సీజ్  

గత ఏడాది నుంచి దేశానికి విమానాల ద్వారా వివిధ పద్ధతుల్లో దిగుమతి చేసుకుంటున్న బంగారంపై ముంబైలోని  డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) దృష్టిపెట్టింది. ఈ క్రమంలో పలు విడతలుగా 405కోట్ల విలువైన దాదాపు 800 కిలోల బంగారాన్ని డీఆర్​ఐ స్వాధీనం చేసుకుంది. గత వారం లక్నో మరియు ముంబైలలో బంగారాన్ని దాచిపెట్టి అక్రమంగా తరలిస్తున్న రెండు ఘటనల్లో పెద్ద ఎత్తున బంగారాన్ని సీజ్‌లను చేసినట్టు అధికారులు ప్రకటించారు. కాగా ఇదంతా ఎయిర్​మార్గంలోనే స్మగ్లింగ్ అవుతున్నట్టు డీఆర్​ఐ కనిపెట్టి అక్రమార్కుల ఆటకట్టించడంలో విజయవంతం అయ్యారు.

మే 6న కచ్చితమైన సమాచారం అందుకున్న DRI అధికారులు ముంబైలోని ఎయిర్ కార్గో కాంప్లెక్స్, ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద దుబాయ్ నుండి వచ్చిన ఒక వ్యక్తిని తనిఖీ చేశారు. కాగా, దిగుమతి పత్రాలలో ఆ వస్తువును డ్రమ్ టైప్ డ్రైన్ క్లీనింగ్ మెషీన్‌లుగా పేర్కొన్నారు.  అయితే అనుమానం వచ్చి.. జాగ్రత్తగా పరిశీలించినప్పుడు సూచించన సరుకులో దిగుమతి చేసుకున్న యంత్రం యొక్క రెండు మోటారు రోటర్లలో 5.8 కిలోల బంగారం దాచిపెట్టి,  డిస్క్ రూపంలో తీసుకొచ్చారు. దీని విలువ దాదాపు  రూ. 3.10 కోట్ల విలువ ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇక.. దిగుమతిదారుడిని దక్షిణ ముంబైలో అరెస్టు చేశారు. అతనికి స్థానిక కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.

ముంబయిలో జరిగిన ఈ ఘటనకు ఒక రోజు ముందు అంటే.. మే 5న లక్నోలో DRI అధికారులు మరో  దాడి చేసి దొంగతనంగా తీసుకొస్తున్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ సందర్భంలో కూడా చౌదరి చరణ్ సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్ కార్గో కాంప్లెక్స్ లో ఎలక్ట్రికల్ థ్రెడింగ్ మెషీన్‌ను కలిగి ఉన్న దిగుమతి కార్గోను DRI అడ్డగించింది. లక్నోలోని విమానాశ్రయం, బంగారు డిస్క్ ల పద్ధతిలోనే ఈ మెషీన్‌లలో దాచి తీసుకొచ్చారు. ఈ కేసులో మొత్తం 5.2 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపు రూ.2.78 కోట్ల విలువ ఉంటుందని అధికారుల అంచనా.

అంతేకాకుండా గత సంవత్సరంలో DRI కార్గో మరియు కొరియర్ సరుకుల నుండి పెద్ద ఎత్తున బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. 2021జూలైలో DRI ఒక కొరియర్ సరుకు నుండి 8 కోట్ల రూపాయల విలువైన 16.79 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత 2021 నవంబర్‌లో ఒక కార్గో సరుకు నుండి 80.13 కిలోల స్మగ్ల్డ్ బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. దీని విలువ 39.31 కోట్ల రూపాయలు గా ఉంటుంది..  అయితే ఈ రెండు ఇన్సిడెంట్లు న్యూఢిల్లీలో జరిగాయి.

ఇక.. 2021 ఆగస్ట్ లో ముంబైలోని ఇంటర్నేషనల్ కొరియర్ టెర్మినల్‌కు వచ్చిన సరుకులో స్మగ్లింగ్ బంగారాన్ని దాచిపెట్టే పద్ధతిని ఉపయోగించినట్లు DRI గుర్తించింది. DRI ఆ దిగుమతి సరుకు నుండి 2.67 కోట్ల రూపాయల విలువైన 5.25 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుంది.  విమాన కార్గో మరియు కొరియర్ మార్గం ద్వారా దేశంలోకి విదేశీయులు బంగారాన్ని స్మగ్లింగ్ చేసే ప్రక్రియను  బహిర్గతం చేయడంలో ఈ ఘటనలు ఎంతో ఉపయోగపడ్డాయి. ఇటువంటి పద్ధతులతో పాటు.. స్మగ్లింగ్ అనేది  అధునాతన పద్ధతులను గుర్తించి మరియు ఎదుర్కోవడంలో DRI సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. 2021-22 మధ్యకాలంలో DRI అధికారులు దాదాపు రూ. 405 కోట్ల విలువైన 833 కిలోల అక్రమ రవాణా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement