Thursday, April 25, 2024

భారత్ లో లాక్ డౌన్ పెట్టండి: డాక్టర్ ఆంథోనీ

భారతను కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకీ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. అదే స్థాయిలో కరోనా మరణాలు కూడా సంభవిస్తున్నాయి. భారత్ లో కోవిడ్ సంక్షోభంపై డాక్టర్ ఆంథోనీ ఎస్ ఫౌసీ కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని వారాలు దేశాన్ని లాక్ డౌన్ చేయాలని, ఎక్కడివారు అక్కడే ఉండిపోవాలని ఆయన వ్యాఖ్యానించారు. అప్పుడు సాధారణ స్థితికి చేరుకుంటామని ఆయన అభిప్రాయపడ్డారు. ఏ దేశమూ కూడా తనను తాను లాక్ చేయటానికి ఇష్టపడదన్నారు. తప్పని పరిస్థితుల్లో కొన్ని వారాల పాటు లాక్ డౌన్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలా చేయకలిగినప్పుడే భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని అంతం చేయగలదన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రతిఒక్కరూ ధైర్యంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.

భారతదేశంలో పరిస్థితిపై తానెలాంటి విమర్శలు చేయనని చెప్పారు. అలా చేస్తే అది రాజకీయ సమస్య అవుతుందని పేర్కొన్నారు. తాను ప్రజారోగ్య వ్యక్తిని రాజకీయ వ్యక్తిని కానని స్పష్టం చేశారు. ప్రస్తుతం, భారతదేశం విపత్కర పరిస్థితిలో ఉందని అనిపిస్తోందన్నారు. ఆక్సిజన్ సంక్షోభాన్ని భారత్ ఎదుర్కొంటోంది. ఈ సమస్య నుంచి తక్షణమే గట్టుఎక్కేందుకు అవసరమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ప్రపంచ దేశాలు సైతం భారత్ కు సాయంగా ముందుకు రావాల్సిన సమయమన్నారు. దేశ ప్రజలందరికి టీకాను అందించాలి.. ఆక్సిజన్ అవసరాలను తీర్చాలి. కరోనా సంక్షోభ సమయాల్లో ప్రజలందరికి సరైన చికిత్స అందించాలి. గతంలో సంక్షోభ సమయాల్లో భారత్ ఎంతో సాయం చేసిందని, ఇప్పుడు ఆ దేశానికి సాయం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అమెరికాలో టీకాలను పంపిణీ చేయడంలో తమ నేషనల్ గార్డ్స్ చేసిన సాయం మాదిరిగా భారత్ లోనూ సైనిక సాయం పొందవచ్చునని డాక్టర్ ఆంథోనీ సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement