Tuesday, April 16, 2024

ముంబైలో దారుణం.. విషం పెట్టి తాబేళ్లను చంపేశారు, ఎందుకంటే..

ముంబై సమీపంలోని చెరువులో డజన్ల కొద్దీ తాబేళ్లు చనిపోయాయి. నీటిపై తేలాడుతూ కనిపించడంతో ఇప్పుడా ఏరియాలో ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది. చెరువు నీళ్లలో విషం కలపడం వల్లనే తాబేళ్లు చనిపోయాయని వన్యప్రాణుల నిపుణులు అంటున్నారు.

దేశ వినోద రాజధానికి తూర్పున 50 కిలోమీటర్లు (30 మైళ్లు) దూరంలో ఉన్న కళ్యాణ్‌లోని చెరువు ప్రాంతంలో దుర్వాసన రావడంతో స్థానిక రాజకీయ నాయకుడు అదేంటో తెలుసుకోవాలని అధికారులను కోరారు. దీంతో పరిరక్షణ కార్యకర్తలు ఈ ఘటనపై అప్రమత్తమయ్యారు. 57 ఫ్లాప్‌ షెల్ తాబేళ్లు చనిపోయాయని, మరో ఆరింటిని రక్షించామని వైల్డ్ యానిమల్ అండ్ రెప్టైల్ రెస్క్యూ కన్జర్వేషన్ గ్రూప్‌కు చెందిన సుహాస్ పవార్ తెలిపారు. చెరువులో అక్రమంగా పెంచుతున్న చేపలను తాబేళ్లు తింటున్నాయన్న కారణంగా స్థానికులు వాటిని చంపేందుకు ప్లాన్ వేశారని ఆయన ఆరోపించారు.

ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. పోస్ట్ మార్టం, శాస్త్రీయ విశ్లేషణ తర్వాత తాబేళ్ల మరణానికి కచ్చితమైన కారణాన్ని తెలుసుకుంటాం అని పవార్ అన్నారు. రెండేళ్లుగా కొవిడ్- ఆంక్షలతో తాబేళ్ల సంఖ్య పెరుగోతోందని అన్నారు. జనాలు పెద్దగా బయట తిరగకపోవడం వంటి ఆంక్షలతో చెరువులో చేపలు పెరిగే అవకాశం ఉంది. ఈ తాబేళ్లు ఇప్పుడు వాటిని తినడం ద్వారా చేపల సంఖ్య తగ్గిపోతోంది. దీంతో కొంతమంది స్థానికులు కోపంతో వాటిని చంపేందుకు ప్లాన్ చేశారు. అని పవార్ చెప్పారు. భారతీయ ఫ్లాప్‌షెల్ తాబేళ్లు ప్రత్యేకించి అరుదైనవి కావు. కానీ, వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం ఆ జాతిని రక్షించాల్సిన అవసరం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement