Saturday, March 25, 2023

గుజరాత్​ ఘటనను రాజకీయం చేయొద్దు.. మృతులను అగౌరవించొద్దన్న రాహుల్​గాంధీ​

గుజరాత్‌లోని మోర్బీ బ్రిడ్జి కూలిన ఘటనకు బాధ్యులు ఎవరని మీడియా అడిగిన ప్రశ్నలపై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. ఈ ఘటనను రాజకీయం చేయకూడదని చెప్పారు. ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దీన్ని రాజకీయం చేయడం అంటే వారికి అగౌరవంగా ఉంటుంది. దీనిపై రాజకీయాలు చేయదలచుకోలేదు.. అని కాంగ్రెస్ ముఖ్య నేత అన్నారు.

- Advertisement -
   

అయితే, మోర్బీ బ్రిడ్జి కూలిన ఘటనపై గుజరాత్‌లో అధికారంలో ఉన్న బీజేపీపై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సింగ్ సూర్జేవాలా ఈ ఘటనను మానవ నిర్మిత విషాదంగా అభివర్ణించారు. గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వాన్ని ఈ ఘటనకు దోషిగా పేర్కొన్నారు. ఇది సహజ ప్రమాదం కాదు.. మానవ నిర్మిత విషాదం అని.. ఈ క్రూరమైన నేరానికి గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వమే ప్రత్యక్షంగా దోషి అని సుర్జేవాలా ట్వీట్‌ చేశారు.

మృతుల కుటుంబాలకు ప్రకటించిన పరిహారంపై సుర్జేవాలా ప్రధాని నరేంద్ర మోదీ, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌పై కూడా విరుచుకుపడ్డారు.గుజరాతీ సోదరులు, సోదరీమణుల జీవితాలకు 2 లక్షల రూపాయల పరిహారం ప్రకటించడం ద్వారా పీఎం, సీఎం తమ బాధ్యత నుండి తప్పించుకోలేరు.. అని కాంగ్రెస్ ఎంపీ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఎన్నికల ర్యాలీలో బెంగాల్ ప్రభుత్వంపై ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ కాంగ్రెస్ నేత, త్రిపుర ఇన్‌చార్జి డాక్టర్ అజోయ్ కుమార్ ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. గుజరాత్‌లో మోర్బీ బ్రిడ్జి కూలిపోవడం చాలా దారుణమని, ఇది మోడీజీ మోసానికి దేవుని సందేశంగా ఆయన పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో మచ్చు నదిలో కేబుల్ వంతెన కూలిపోవడంతో 133 మందికి పైగా మరణించారు. పలువురు గాయపడ్డారు.

 

Advertisement

తాజా వార్తలు

Advertisement