Wednesday, March 27, 2024

డోంట్ టేక్ ఇట్ ఈజీ.. స్వీయ జాగ్రత్తే .. శ్రీరామ రక్ష..

ప్రభన్యూస్‌ : కొవిడ్‌ మూడవ దశ ఒమిక్రాన్‌పై ఇప్పుడిప్పుడే జోరుగా చర్చలు సాగుతున్నాయి. అందరూ జాగ్రత్తలు చెప్పేవారే కానీ పాటించే వారు కరువవుతున్నారు. మాస్కు లేకుండా యథేచ్ఛగా తిరుగుతున్నారు. అన్ని కార్యక్రమాల్లో సామాజిక దూరం పాటించడం కరువైపోయింది. దీంతో ఏదో ఒక రూపంలో ఒమిక్రాన్‌ విరుచుకుపడే అవకాశం మన స్వీయ తప్పిదంగానే భావించాల్సి ఉంటుంది. దేశంలో ఒమిక్రాన్‌ కేసులు తొలుత కర్నాటకలో బయటపడగా , సదరు బాధ్యతలు వేగవంతంగా కోలుకుంటుండడం ఊరట కలిగించే అంశమే అయినప్పటికీ వ్యాధి వచ్చిన తర్వాత బాధపడేదానికన్నా రాకుండా చూసుకోవడమే ఎంతో మేలు. కొవిడ్‌ ప్రొటోకాల్‌ను తప్పనిసరిగా పాటించాల్సిన అవసరాన్ని వైద్యులు నొక్కి చెబుతున్నారు.

వాతావరణం మారిపోయింది. చల్లగాలులు మొదలయ్యాయి .. వర్షాలు.. గాలిలో తేమ.. ఇవన్నీ ఇప్పుడు వాతావరణంలో భాగంగా ఉన్నాయి. అసలే ఒక పక్క కరోనా.. దీనికి తోడు ఈ చల్లని.. తడి వాతావరణం మన ఆరోగ్యంపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. సాధారణంగా వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ఎక్కువగా చక్కర్లు కొట్టి మనకు ఇబ్బంది కలిగిస్తాయి. వాటిలో కొన్ని ప్రాణాంతకమైనవి ఉన్నాయి. వర్షం కారణంగా ఇళ్లలోకి తేమ రావడం వల్ల తేమ సమస్య తలెత్తుతుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధులను నివారించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. జిల్లా అంతటా ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా , వరదల కారణంగా అయితేనేమీ గ్రామీణ ప్రాంతాల్లో పలు చోట్ల నీరు నిల్వ ఉండిపోయింది. పట్టణాల్లో కూడా పారిశుధ్య పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. పట్టణాల్లోని ప్రైవేటు ఆస్పత్రులన్నీ డెంగ్యూ, టైఫాయిడ్‌ బాధితులతో కిటకిటలాడుతున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement