Thursday, April 25, 2024

డోనాల్డ్ ట్రంప్ మొద‌టి భార్య.. ఇవానా ట్రంప్ క‌న్నుమూత‌

అమెరికా మాజీ అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ మొద‌టి భార్య ఇవానా ట్రంప్ క‌న్నుమూశారు. ఆమె వ‌య‌సు 73 ఏళ్లు. ఆమెకు ముగ్గురు పిల్ల‌లు ఉన్నారు. న్యూయార్క్ సిటీలోని త‌న ఇంట్లో ఇవానా ట్రంప్ మృతిచెందిన‌ట్లు డోనాల్డ్ ట్రంప్ త‌న సోష‌ల్ మీడియా పోస్టులో తెలిపారు. ఆమె ఓ అద్భుత‌మైన‌, అంద‌మైన మ‌హిళ అని, ప్రేర‌ణాత్మ‌క జీవితాన్నిఆమె గ‌డిపిన‌ట్లు డోనాల్డ్ ట్రంప్ త‌న పోస్టులో తెలిపారు. ఇవానా ట్రంప్‌కు జూనియ‌ర్ డోనాల్డ్‌, ఇవాంకా ట్రంప్‌, ఎరిక్ అనే పిల్ల‌లు ఉన్నారు. వారంటే ఆమెకు ఎంతో ఇష్ట‌మ‌ని, ఆమె ఎంతో గ‌ర్వ‌ప‌డేద‌ని, ఇవానా రెస్ట్ ఇన్ పీస్ అంటూ త‌న పోస్టులో డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement