పలు ఐటెంసాంగ్స్ లో మెరిసింది ముంతాజ్. అంతేకాదు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన ఖుషీ చిత్రంలో నటించింది. కాగా ఈమెపై గృహహింస కేసు నమోదయింది. ముంతాజ్ ప్రస్తుతం చెన్నైలోని అన్నానగర్ ఉంటోంది. ఆమె ఇంట్లో కొన్నేళ్లుగా ఉత్తరాదికి చెందిన ఇద్దరు మైనర్ బాలికలు పని చేస్తున్నారు. వీరిలో ఒక బాలిక ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముంతాజ్ తమను వేధిస్తోందని, తమను సొంత ఊరికి కూడా పంపడం లేదని ఫిర్యాదులో పేర్కొంది. ప్రతి రోజు చిత్ర హింసలు పెడుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. బాలిక ఫిర్యాదు మేరకు ముంతాజ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరు బాలికలను బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. మరోవైపు ముంతాజ్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. ఈ విషయంపై ముంతాజ్ ఇంకా స్పందించాల్సి ఉంది.
నటి ముంతాజ్ పై గృహహింస కేసు – అరెస్ట్ చేసే ఛాన్స్

Previous articlePetrol and diesel price: హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ఎంతంటే..
Next articleStock Market: 900 పాయింట్ల నష్టపోయిన సెన్సెక్స్
Advertisement
తాజా వార్తలు
Advertisement