Wednesday, April 24, 2024

నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు..

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ముగిశాయి. అమెరికాలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల కారణంగా ఐటీ కంపెనీల స్టాక్స్ లో 10 నుంచి 27 శాతం వరకు దిద్దుబాటు ఉండే అవకాశముందని క్రెడిట్ సూయిజ్ నివేదిక తెలపడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీసింది. ఈ నేపథ్యంలో మదుపరులు అమ్మకాలకు మొగ్గు చూపారు. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 389 పాయింట్లు కోల్పోయి 62,181కి పడిపోయింది. నిఫ్టీ 112 పాయింట్లు నష్టపోయి 18,496 వద్ద స్థిరపడింది. ఐటీ, టెక్ సూచీలు 2 శాతానికి పైగా నష్టపోయాయి. నిన్న గుజరాత్ ఫలితాల కారణంగా పైకెగసిన మార్కెట్లు… ఈరోజు మాత్రం నష్టాలతో ముగిశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement