Wednesday, April 24, 2024

10 రూపాయలు తగ్గిన వంట గ్యాస్ ధర

గ్యాస్ సిలిండర్ వాడుతున్న వారికి ఊరట. ఎల్‌పీజీ సిలిండర్ ధర స్వల్పంగా తగ్గింది. డొమెస్టిక్ వంట గ్యాస్‌పై 10 రూపాయల తగ్గింది. అంతర్జాతీయంగా చమురు ధరలు దిగి వస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి కొత్త రేట్లు అమలులోకి వస్తాయి. ఏప్రిల్ నుంచి గ్యాస్ సిలిండర్ ధర మరింత పెరగొచ్చని చాలా మంది భావించారు. అయితే ఇలా పెరగకపోగా స్వల్పంగా తగ్గడం కాస్త ఊరట కలిగించే అంశమనే చెప్పుకోవచ్చు.

నేటి నుంచి 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 809 కానుంది. ఆసియా, ఐరోపా దేశాల్లో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తుండడం, దీనికి తోడు టీకా దుష్ప్రభావాలపై ఆందోళన కారణంగా గత నెల రెండో అర్ధభాగం నుంచి అంతర్జాతీయంగా చమురు ధరల్లో తగ్గుదల కనిపిస్తోంది. భారత్‌లో వారం రోజుల్లో పెట్రో ధరలు మూడుసార్లు స్వల్పంగా తగ్గాయి. కాగా, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పతనం అవుతుండడంతో మున్ముందు పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement