Wednesday, April 24, 2024

KTR: కుక్కల కోసం ప్రత్యేక పార్క్.. ఎలా ఉందో చూశారా?

ప్రజలు ఆహ్లాదకరంగా గడిపేందుకు పార్కులకు వెళ్తుంటారు. కానీ శునకాల కోసం పార్కును ఏర్పాటు చేయడం ఎప్పుడైనా, ఎక్కడైనా చూశారా? అవును మీరు చదివింది నిజమే. కుక్కల కోసం ప్రత్యేక పార్కు ఏర్పాటైంది. వరంగల్ లో కుక్కలకు ప్రత్యేకంగా పార్కు ప్రారంభం కాబోతున్నది. తొలిసారిగా శునకాల కోసమే ఈ పెట్ పార్కును ఏర్పాటు చేశారు. ఇందులో కుక్కలు సరదాగా సేదదీరడానికి ఆధునిక ఆట పరికరాలనూ తీసుకొచ్చారు. వీధి కుక్కలు జఠిలమైన సమస్యలగా మారుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కుక్కల కోసం ప్రత్యేకంగా పార్క్ ను ఏర్పాటు చేసింది. వీధి కుక్కలకు పూర్తి సంరక్షణ. వదిలివేసిన జంతువుల పట్ల ఆప్యాయతతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం వరంగల్‌లో కుక్కల కోసం డాగ్ పార్క్, వ్యాన్ & బర్త్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement