Wednesday, April 24, 2024

ఒక సెక్స్ వ‌ర్క‌ర్‌కి ఉన్న హ‌క్కు కూడా భార్య‌కు ఉండ‌దా? : ఢిల్లీ హైకోర్టు

ఇష్టం లేకున్నా సెక్స్ చేయ‌డం అనే అంశంపై ఢిల్లీహైకోర్టు సీరియ‌స్ వ్యాఖ్య‌లు చేసింది. క‌నీసం సెక్స్‌ వర్కర్‌కి ఉండే రైట్స్ క‌డా వైఫ్‌కి ఉండ‌వా అని అని ప్ర‌శ్నించింది. బలవంతపు శృంగారం వద్దని చెప్పే హక్కు భార్యకు ఉండదా అని ధ‌ర్మాస‌నం క్వ‌శ్చ‌న్ చేసింది. వైవాహిక అత్యాచారాలకు సంబంధించి దాఖలైన పిటిషన్లను విచారిస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

ఇష్టం లేకుండా సెక్స్‌ వర్కర్‌తో సంభోగించడంలో అత్యాచార చట్టం ఎలాంటి మినహాయింపునివ్వదని, ఈ విషయంలో భార్యకు ఉండే హక్కులను ఎందుకు కాలరాయాలని జస్టిస్‌ హరి శంకర్‌ వ్యాఖ్యానించారు. వైవాహిక అత్యాచారాన్ని క్రిమినల్‌ నేరంగా పరిగణించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కోర్టు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement