Friday, May 20, 2022

బాలికపై లారీడ్రైవ‌ర్ అఘాయిత్యం, ప్రెగ్నెన్సీ రావ‌డంతో అబార్ష‌న్‌.. త‌ల్లి ఫిర్యాదుతో వెలుగులోకి

ఇబ్రహీంపట్నం (ప్రభన్యూస్): మైనర్ బాలిక పదహారేళ్లకే తల్లయ్యింది. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం కుదాస్ పల్లి గ్రామానికి చెందిన బాలిక (16)ను అదే గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ సరిపంగా శ్రవణ్ (25) అనేక మార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో బాలిక నాలుగు నెలల గర్భం దాల్చింది. ఈ విషయం శ్రావణ్‌కి తెలియడంతో గత నెల 30వ తేదీన ఇబ్రహీంపట్నం కేంద్రంలోని అనిరెడ్డి రామరక్షా ఆసుపత్రిని సంప్రదించి అక్కడి వైద్యురాలు డాక్టర్ ప్రణతి రెడ్డితో సంప్రదింపులు జరిపి డీల్ కుదుర్చుకొన్నాడు. ఆ మరుసటిరోజే బాలికకు అబార్షన్ చేశారు. విషయం తెలుసుకున్న బాలిక తల్లి మర్రిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఇబ్రహీంపట్నంలోని అనిరెడ్డి రామరక్షా ఆస్పత్రిలో వివరాలు సేకరించారు. దీంతో మైనర్ బాలిక అబార్షన్ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది.

ఆసుపత్రి తనిఖీ..
అనిరెడ్డి రామరక్షా ఆస్పత్రిని డీఎంహెచ్ఓ నాగజ్యోతి నోడల్ అధికారి శ్రీనివాసులు కలిసి తనిఖీలు నిర్వహించి రికార్డులను పరిశీలించారు. బాలిక కేస్ షీట్ వివ‌రాల‌ను పరిశీలించారు. దీంతో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. మైనర్ అని మర్రిగూడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా అనిరెడ్డి రామరక్ష ఆస్పత్రిలో 18 సంవత్సరాలని డాక్ట‌ర్లు రికార్డులలో ఎలా నమోదు చేశారని ప్ర‌శ్నించారు. ఆస్పత్రి వైద్యులు ఎలాంటి ఆధారాలు చూపలేదని వైద్య అధికారులు తెలిపారు. దీంతో అనిరెడ్డి రామరక్షా ఆస్పత్రి రికార్డులను సీజ్ చేసిన‌ట్టు స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement