Thursday, April 25, 2024

మ‌నిషికి పంది గుండె – వైద్య చ‌రిత్ర‌లో అద్భుతం

గుండె జ‌బ్బుతో బాధ‌ప‌డుతోన్న ఓ వ్య‌క్తికి పంది గుండెను ట్రాన్స్ ప్లాంట్ చేసి విజ‌యం సాధించారు వైద్యులు. పంది గుండె అమ‌ర్చిన వ్య‌క్తి ఆరోగ్యంగా ఉన్నాడు. అత్యంత ప్ర‌యోగాత్మ‌కంగా ఈ స‌ర్జ‌రీ జ‌రిగింది. మూడు రోజుల తర్వాత అతను బాగానే ఉన్నాడని మేరీల్యాండ్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ప్రాణాంతక గుండె జబ్బుతో బాధపడుతున్న 57 ఏళ్ల వ్యక్తి జన్యుపరంగా మార్పు చెందిన పంది నుండి గుండెను అమర్చారు. పంది గుండెను మానవునికి విజయవంతంగా మార్పిడి చేయడం ఇది మొదటిసారి. బాల్టిమోర్‌లో ఈ ఆపరేషన్ ఎనిమిది గంటల పాటు కొనసాగింది. పందిగుండె అమర్చిన తరువాత మేరీల్యాండ్‌కు చెందిన డేవిడ్ బెన్నెట్ సీనియర్ బాగానే ఉన్నారని యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ మెడికల్ సెంటర్‌లోని సర్జన్లు తెలిపారు.ఆపరేషన్ తరువాత మామూలు మనిషి గుండెలాగే.. అది పనిచేస్తోందని, అది చూసి తాము థ్రిల్ అయ్యామని ఆపరేషన్ చేసిన మెడికల్ సెంటర్‌లోని కార్డియాక్ ట్రాన్స్‌ప్లాంట్ ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ బార్ట్లీ గ్రిఫిత్ అన్నారు.

కిడ్నీలు, ఇతర అవయవాల కోసం ఎదురుచూస్తున్న అర మిలియన్ కంటే ఎక్కువ మంది అమెరికన్లకు ఇలాంటి విధానాలు భవిష్యత్తులో వైద్యరంగంలో కొత్త ఆశాకిరణంగా కనిపిస్తున్నాయని పరిశోధకులు భావిస్తున్నారు. అయితే ఈ వైద్య విధానం ప్ర‌తీసారి ఫలించదని కూడా వైద్యులు చెబుతున్నారు. అన్నిరకాలుగా పరీక్షలు చేసి సరిపోతుందని నిర్దారణ తరువాత ట్రాన్స్ ప్లాంట్ చేసిన మానవ కిడ్నీలే ఒక్కోసారి శరీరం ఒప్పుకోదని.. అలాంటిది పందుల నుంచి అనేది అంత సులభమైన విషయం కాదని కూడా వీరు చెబుతున్నారు. అయితే పందిగుండెను అమర్చుకున్న రోగి బెన్నెట్ ఈ ప్రయోగాత్మక చికిత్సకు ధైర్యంగా ముందుకు వచ్చాడు. ఇది జరగకపోతే అతను చనిపోవడం ఖాయం. అందుకే గుండె జబ్బుతో చనిపోవడం కంటే ఇదే మేలు అనుకున్నాడు. అంతేకాదు అప్పటికే అతనికి అనేక రకాల చికిత్సలు జరిగినందున మనిషి గుండె దొరికే ఛాన్స్ లేదు.ఆపరేషన్ కు ముందు అతను గుండె-ఊపిరితిత్తుల బైపాస్ మెషీన్‌తో కనెక్ట్ చేసి ఉండేవాడు. ఆపరేషన్‌ తరువాత కూడా అది అలాగే ఉంచారు. మెల్లగా అతని గుండె పనిచేస్తూ ఈ మెషీన్ పనిని తగ్గిస్తూ వస్తోంది. ఈ మెషీన్ తొలగించే అవకాశం ఉంది. ప్ర‌పంచంలో ఇది అద్భుత‌మ‌నే చెప్పాలి. తొలిసారి చేసిన ఈ ప్ర‌యోగం స‌క్సెస్ కావ‌డంతో వైద్యుల ఆనందానికి అవ‌ధులేకుండా పోయింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement