Monday, March 25, 2024

‘ఓటుకు రాకు.. కరోనాతో ఖతమైపోకు’: వరంగల్‌లో ఓ డాక్టర్ వినూత్న ప్రచారం

వ‌రంగ‌ల్‌లో ఈనెల 30న మున్సిప‌ల్ ఎన్నిక‌లున్న నేప‌థ్యంలో డా.కోట శ్యాంకుమార్ వినూత్న ప్ర‌చారం చేశాడు. న‌గ‌రంలో పరిస్థితులు బాగోలేవని, ఓటింగ్ కోసం వ‌స్తే క‌రోనా ఖ‌తం చేస్తుంద‌ని, జ‌నం ఓట్లేసేందుకు రాకండి అంటూ వ‌రంగ‌ల్ ఎంజీఎం ముందున్న గాంధీ విగ్ర‌హం వద్ద ప్ల‌కార్డుల‌తో నిర‌స‌న తెలిపాడు.

‘రాజకీయ నాయకులకు ఓట్లు మాత్రమే కావాలి. ప్రజల ప్రాణాలు ఏమైపోయినా వాళ్లకు అవసరం లేదు. దయచేసి అర్థం చేసుకోండి పరిస్థితులు అస్సలు బాగాలేవు ఎవరు ఓటింగ్‌లో పాల్గొనవ‌ద్దు. 10 లక్షల మంది చనిపోయిన ప్రభుత్వానికి పోయేదేమీ లేదు. కానీ మీ కుటుంబంలో ఒక్కరిని పోగొట్టుకున్నా మీరు భరించలేరు కాబట్టి ఎవ్వరు కూడా ఓటింగ్‌లో పాల్గొనకండి’ అంటూ ఆ డాక్టర్ ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. ‘మీ ప్రాణాలకు మీరే రక్ష .. ఓటు అడిగిన వారెవ్వరూ కూడా మీకు వైద్యం చేయించరు. భార్య, పిల్లలను, తల్లిదండ్రులను వదిలేసి ప్రాణాలు కూడా లెక్కచేయకుండా కరోనాతో వైద్యులు పోరాడుతుంటే.. స్వార్థం కోసం రాజకీయ నేతలు ఎన్నికలను పెట్టి ఎంతమందిని కరోనాతో బలితీసుకుంటారు?’ అని డాక్టర్ కోట శ్యాంకుమార్ ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement