Thursday, April 25, 2024

ABP Seavoter survey: ఉత్తరప్రదేశ్ నెక్ట్స్ సీఎం ఎవరు?

వచ్చే ఏడాది దేశంలోని ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అయితే, దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీని మళ్లీ అధికారం కట్టబెడుతారా? లేక సమాజ్ వాదీ పార్టీకి పట్టం కడతారా? బీఎస్సీ, కాంగ్రెస్ పార్టీలు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి ? అన్నది ఇప్పుడు అందరిలో వ్యక్తమవుతున్న ప్రశ్న.

రాష్ట్రంలోని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ పై ప్రజల్లో వ్యతిరేకత ఉందని ప్రలపక్షాల అభిప్రాయపడుతున్నాయి. ఇది తమకు అనుకూలిస్తాయని భావిస్తున్నాయి.  ఈ నేపథ్యంలో అధికారాన్ని కైవసం చేసుకునేందుకు అన్ని పార్టీలు సర్వ శక్తులు ఒడ్డుతున్నాయి.

మరోవైపు యూపీలో ఏ పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారు? ఎవరు సీఎం కాబోతున్నారు? అనే విషయంపై పలు సంస్థలు ఇప్పటి నుంచే సర్వేలు చేస్తున్నాయి. ఈ క్రమంలో యోగి ఆదిత్యనాథ్ మరోసారి యూపీ సీఎం పగ్గాలను అందుకోబోతున్నారని ఏబీపీ సీఓటర్ సర్వే తెలిపింది. ఆ సంస్థ నిర్వహించిన సర్వేలో 44 శాతం మంది ప్రజలు యోగికి తమ మద్దతును ప్రకటించారు. 31 శాతం మంది సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సీఎం కావాలని కోరుకోగా.. 15 శాతం మంది బీఎస్పీ అధినేత్రి మాయావతి వైపు మొగ్గు చూపారు. ఇక, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీకి కేవలం 4 శాతం మంది మాత్రమే మద్దతు తెలిపారు. రెండు శాతం మంది జయంత్ చౌదరిని సీఎంగా చూడాలనుకుంటున్నారు.

ఇక, రాష్ట్రంలో 43 శాతం ప్రజలు యోగి పనితీరుపై సంతృప్తిని వ్యక్తం చేసినట్లు సర్వేలో తేలింది. 36 శాతం మంది యోగి పనితీరు చెత్తగా ఉందని తెలిపారు. 21 శాతం మాత్రం పర్వాలేదని చెప్పారు. మొత్తం 7,509 మందితో ఏబీపీ సీవోటర్ సర్వే నిర్వహించింది. కాగా, ఈ సర్వే బీజేపీకి అనుకూలంగా ఉండడంతో ఆపార్టీ నేతలు సంతోషంలో మునిగిపోయారు. దీంతో బీజేపీ శ్రేణులు సంబంరాలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement