Monday, October 7, 2024

దమ్ముంటే చైనాపై సర్జికల్ స్ట్రైక్స్ చేయండి.. ఓవైసీ

దమ్ముంటే చైనాపై సర్జికల్ స్ట్రైక్స్ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ సవాల్ విసిరారు. హైదరాబాద్ పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహిస్తామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ గతంలో చేసిన వ్యాఖ్యలపై అస‌దుద్దీన్ ఓవైసీ ఫైర్ అయ్యారు. 2020లో జరిగిన బహిరంగ సభలో బండి సంజయ్ మాట్లాడుతూ, రోహింగ్యా, పాకిస్తానీ, ఆఫ్ఘనిస్తాన్ ఓటర్ల సహాయంతో హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలవాలని పాలక భారత రాష్ట్ర సమితి, ఎంఐఎం చీఫ్ ఒవైసీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, రోహింగ్యా ఓటర్లు లేకుండా జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని బండి సంజయ్ సవాల్ విసిరారు. ఎన్నికల్లో గెలిస్తే ఓల్డ్ సిటీలో సర్జికట్ స్ట్రైక్ చేస్తామ‌ని అన్నారు. దీనిపై ఓవైసీ పై విధంగా స్పందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement