Thursday, May 26, 2022

కోర్టులను రాజకీయాలకు వాడుకోవద్దు : సుప్రీంకోర్టు

కోర్టులను రాజకీయాలకు వాడుకోవద్దని సుప్రీంకోర్టు తెలిపింది. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేయొద్దని సుప్రీంకోర్టు పేర్కొంది. షాహిన్ బాగ్ లో ఈరోజు ఉదయం నుంచి ఉద్రికత్త చోటుచేసుకుంది. మున్సిపల్ అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. ఈ కూల్చివేతలను స్థానికులు అడ్డుకుంటున్నారు. స్థానికుల ఆందోళనలతో బుల్డోజర్లు వెనుదిరిగాయి. అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై సీపీఎం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. షాహీన్ బాగ్ కూల్చివేతలపై జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు తెలిపింది. ఢిల్లీ హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. బాధితులు కాకుండా రాజకీయ పార్టీ పిటిషన్ వేయడమేంటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement