Friday, April 19, 2024

ఎవ్వరినీ నమ్మొద్దు.. వచ్చే 8 వారాలు జాగ్రత్తగా ఉండాలే.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు

Omicron వేరియంట్ దేశంలో కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ లో ఉందని, రాబోయే వారాల్లో మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందంటున్నారు వైద్య నిపుణులు. దీంతో దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయని, ప్రధాన నగరాల్లో కేసుల తగ్గుదల ఉన్నప్పటికీ హాస్పిటళ్లలో ఎక్కువ మంది బాధితులు చేరుతున్నారని పేర్కొన్నారు. గత 24 గంటల్లో దేశంలో 3,06,064 కొత్త కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత నాలుగు రోజుల్లో నమోదైన సగటు రోజువారీ కేసులతో పోలిస్తే 8% తగ్గుదల ఉందని తెలిపింది. 439 మంది చనిపోయారని, ఈ ఐదు రోజుల్లో మరణాల సంఖ్య కూడా చాలామటుకు తగ్గిందని వైద్యవర్గాలు అంచనా వేస్తున్నాయి.

కానీ, ఈ వారంలో నమోదైన పాజిటివిటీ రేట్లు ఈ రోజు (జనవరి 24) వరకు పెరిగినట్టు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. డిసెంబర్ 27 వ‌ర‌కు దాదాపు 0.63% ఉన్న పాజిటివిటీ రేటు జనవరి 24వరకు 17.03%కి చేరింది. దీనికి ఒమిక్రాన్ అత్యధికంగా ట్రాన్స్ మిసిబుల్ వేరియంట్ కావడమే కారణమని చెబుతున్నారు వైద్య నిపుణులు. Omicron వేరియంట్ కి సంబంధించి చాలా కేసులు తేలికపాటి లక్షణాలే కావ‌చ్చు.. అయితే కొంతమంది హాస్పిటల్ చేరడం, ఇంటెన్సివ్ కేర్‌లో కూడా కేసులు పెరుగుతున్నాయని సలహా బృందం తెలిపింది. గత రెండు వారాలుగా రాజధాని, ఢిల్లీ, అత్యంత సంపన్న రాష్ట్రమైన మహారాష్ట్ర, ఆర్థిక కేంద్రమైన ముంబై వంటి ప్రధాన నగరాల్లో కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. కాగా, సెమీ-అర్బన్, గ్రామీణ ప్రాంతాలకు కేసులు విస్తరిస్తున్నాయని వైద్య నిపుణులు తెలిపారు.

వచ్చే ఎనిమిది నుంచి 10 వారాల్లో మహారాష్ట్రలో కొవిడ్ బాధితుల సంఖ్య భారీ స్థాయిలో ఉంటుందని తాము అంచనా వేస్తున్నట్టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సభ్యుడు COVIDపై జాతీయ టాస్క్ ఫోర్స్ సభ్యుడు డాక్టర్ సుభాష్ సాలుంకే చెప్పారు. దీనిపై గతంలోనే మహారాష్ట్ర ప్రభుత్వానికి సలహా కూడా ఇచ్చినట్టు ఆయన తెలిపారు. ‘‘ముంబై, పూణే వంటి నగరాల్లో కేసుల సంఖ్య టాప్ లెవల్లో ఉంటుంది’’ అని డాక్టర్ సాలుంకే అన్నారు, సెకండ్ వేవ్ లోని ప్రాణాంతక డెల్టా వేరియంట్ కూడా ఇప్పుడు భారీగానే స్ప్రెడ్ అవుతోందన్నారు. దేశం యొక్క మొత్తం అంటువ్యాధుల సంఖ్య 39.54 మిలియన్లకు చేరుకుంది. ఇది యునైటెడ్ స్టేట్స్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా రెండవ అత్యధికంగా ఆయన తెలిపారు. దేశంలో ఇప్పటివరకు 4,89,848 మంది కరోనా వైరస్‌తో చనిపోయినట్టు ప్రభుత్వ లెక్కల ద్వారా తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement