Tuesday, November 12, 2024

Breaking: ఆటో, బొలెరో ఢీ : ఏడుగురు మృతి

ఆటో, బొలెరో వాహ‌నం ఢీకొని ఏడుగురు మృతిచెందిన ఘ‌ట‌న‌ ఉత్తర్​ప్రదేశ్​ రాష్ట్రంలో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని కాస్​గంజ్​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో, బొలెరో వాహనం ఢీకొనటం వల్ల ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా… పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఫరుఖాబాద్ ప్రాంతానికి చెందిన కొందరు భక్తులు పాటియాలలోని బోలే బాబా ఆశ్రమానికి ఆటోలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఆటోలో ఉన్న ఆరుగురు భక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే సమీపంలోని ప్రజలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement