Saturday, April 20, 2024

మాస్కులు మరువద్దు.. సెల్ఫ్ ప్రొటెక్షనే బెటర్..

ప్ర‌భ‌న్యూస్ :దక్షిణాఫ్రికా కొత్త వేరియంట్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అత్యవసరంగా భేటీ అయ్యింది. వేరియంట్‌ తీవ్రత, వ్యాప్తి వంటి అంశాలపై చర్చించింది. ఐరోపాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాల్లో కరోనా విజృంభణ పై కూడా సమీక్షించింది. టీకాలు వేయించుకున్నప్పటికీ.. ప్రతీ ఒక్కరు భౌతిక దూరం పాటించాలని తెలిపింది. మాస్క్‌లు ధరించాలని ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనామ్‌ స్పష్టం చేశారు. మహమ్మారి ముగిసిపోయిందని, టీకా పొందిన వారికి పూర్తి రక్షణ లభిస్తుందనే తప్పుడు భావన ప్రజల్లో నెలకొని ఉందన్నారు. ఈ భావన సరైంది కాదని తెలిపింది డబ్ల్యూహెచ్‌ఓ. ప్రతీ ఒక్కరు స్వీయ రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.

వైరస్‌ వ్యాప్తి నుంచి జాగ్రత్తగా ఉండాలన్నారు. టీకా ప్రాణాలు కాపాడుతాయి కానీ.. వైరస్‌ వ్యాప్తిని పూర్తిగా అడ్డుకోలేవ్‌ అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. రద్దీ ప్రాంతాలకు దూరంగా ఉంటూ.. గాలి, వెలుతురు కోసం కిటీకీలు తెరిచి ఉంచాలని సూచించారు. ఐరోపా, అమెరికా దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నా.. ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి తగ్గిందన్నారు. డెల్టా సృష్టించిన వేరియంట్‌ నుంచి చాలా దేశాలు కోలుకున్నాయని వివరించారు. దక్షిణాఫ్రికాలో వెలుగులోకొచ్చిన బి.1.1.529 వేరియంట్‌ ఆందోళన కలిగిస్తోందన్నారు. దానిలో అసాధారణ మ్యూటేషన్ల కారణగా మునుపటి వేరియంట్ల వేగంగా వ్యాప్తి చెందే లక్షణాలు ఉన్నాయని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement