Tuesday, November 12, 2024

చిరు ధాన్యాలను మ‌రువ‌కండి.. న్యూట్రీషన్ మానిటరింగ్ సర్వే ఏం చెబుతోందంటే..

ప్ర‌భ‌న్యూస్ : ప్రజల ఆహరపు అలవాట్లలో మార్పులు చోటుచేసుకోవడంతో రోగ నిరోధక శక్తి కోల్పోవడంతో పాటు, తరచూ అనారోగ్యం పాలవ్వాల్సివస్తోంది. కానీ ప్రస్తుతం చిరు ధాన్యాల పంటలే తక్కువ ఉండడం, గ్రామీణ ప్రాంతాల్లోనూ మిల్లెట్స్‌ను ఆహరంలో భాగం చేసుకోకపోవడంతో వాటి ద్వారా లభించే పోషకాలు అందడం లేదు. తత్ఫలితంగా ప్రజల్లో విటమిన్ల లోపం, కాల్షి యం సమస్యలు, ఐరన్‌ లోపాల్లాంటివి రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒకమనిషి సగటున రోజుకు తినాల్సిన దానికంటే తక్కువ మోతాదులో చిరుధాన్యాలను తీసుకుంటున్నారని, ఇది ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉందని నేషనల్‌ న్యూట్రిషన్‌ మానిటరింగ్‌ సర్వే తెలిపింది.

ప్రస్తుతం యావత్‌ సమాజాన్ని కొవిడ్ క‌కావిక‌లం చేస్తుండగా, కొవిడ్‌ ఉన్నా.. లేకున్నా ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. శరీరానికి కావాల్సిన పోషకాలు అందాలంటే మాత్రం చిరుధాన్యాలను భోజనంలో తీసుకోవాలని న్యూట్రిషన్‌ నిపుణులు చెబుతున్నారు. రాగి, సజ్జల్లో కాల్షియం, ఫాస్పరస్‌, పొటాషియం, బి విటమిన్‌లు లభిస్తాయి. ముఖ్యంగా సజ్జల ద్వారా మెగ్నీషియం, పొటాషియం, విటమిన్‌ బి-9 లభిస్తుండగా విటమిన్‌ బి-9 గర్భిణులకు ఎక్కువగా ఉపయోగ పడుతుండడంతో పాటు కాల్షియం ఎక్కువగా ఉండడంతో ఎముకల ధృఢత్వానికి ఉపయోగపడుతుంది. వీటితోపాటు మిగతా మిల్లెట్లలోనూ పలు రకాల విటమిన్లు, జింక్‌, ఐరన్‌లు లభించనున్నాయి. భోజనంలో భాగం చేసుకోవాల్సిన మిల్లెట్స్‌లో ప్రధానంగా 10 రకాలున్నాయి. సామలు, కొర్రలు, అరికలు, ఊదలు, అండు కొర్రలు, సజ్జలు, రాగులు, ఒరుగులు, జొన్నలు, మొక్కజొన్న రకాలను అధిక భాగం తీసుకోవాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement