Saturday, June 3, 2023

విధి నిర్వ‌హ‌ణ‌లో ల‌క్ష్మ‌ణ రేఖ‌ను దాటొద్దు – జ‌స్టిస్ ర‌మ‌ణ‌

దేశంలోని న్యాయ‌మూర్తులు విధి నిర్వ‌హ‌ణ‌లో త‌మ ప‌రిమితుల‌ను గుర్తుంచుకోవాల‌న్నారు సీజేఐ జ‌స్టిస్ ర‌మ‌ణ‌. నేడు హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తులు..సీఎంల స‌దస్సు జ‌రిగింది. లక్ష్మణ రేఖను దాటొద్దని కోరారు.. శాసన, కార్య నిర్వాహక, న్యాయ శాఖలకు రాజ్యాంగం వేరు వేరు అధికారాలను కల్పించిందని గుర్తు చేసారు. .ఆరు సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌ వీ రమణ హాజరయ్యారు. ప్రజా స్వామ్య బలోపేతానికి, సామరస్యంగా కార్య కలాపాలు సాగేందుకు ఇది దోహదం చేస్తుందని వివరించారు ర‌మ‌ణ‌. ఈ సందర్భంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దుర్వినియోగం అవుతున్నాయని సీజేఐ ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి వ్యక్తిగత ప్రయోజన వ్యాజ్యాలుగా మారిపోయాయని ఆవేదనతో చెప్పారు సీజేఐ జస్టిస్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement