Thursday, March 28, 2024

Rajasthan: దేశంలోనే తొలిసారిగా ఆవుకు DNA టెస్ట్..

దేశంలోనే తొలిసారిగా.. ఓ ఆవుకి DNA టెస్ట్ చేశారు. ఈ సైంటిఫిక్ పద్ధతి ద్వారా టెస్ట్ చేసి ఆ ఆవును తిరిగి దాని యజమాని దగ్గరకు చేర్చారు. అసలు ఇది ఎలా మొదలైందంటే… 2021 ఫిబ్రవరి 11న దులరామ్ దారా ఆవు కనిపించకుండాపోయింది. ఆయన రాజస్థాన్ లోని సర్దార్ సహర్‌లో నివసిస్తున్నారు. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. సీరియస్‌గా తీసుకున్న పోలీసులు కేసు రాసి… FIR ఫామ్ అతనికి ఇచ్చారు. దాంతో.. ఆవు దొరికేస్తుంది అనుకున్నాడు. కానీ పోలీసులు ఎంత వెతికినా ఆవు కనిపించలేదు. 10 నెలల తర్వాత.. అంటే.. 2021 డిసెంబర్ 8న ఎవరో దారాకి కాల్ చేసి… నీ ఆవు మార్కెట్‌లో ఉంది చూసుకో అని చెప్పారు. 70 ఏళ్ల ముసలాయనకు ఎక్కడలేని ఆనందం వచ్చేసింది. వేగంగా వెళ్లాడు. మార్కెట్‌లో ఏదో తింటూ కనిపించింది కౌ. చూడగానే అది తన ఆవు అని అర్థమైపోయింది. ఇంటికి తీసుకెళ్లాడు. కానీ తర్వాత కొంతమంది గుంపుగా వచ్చి.. దారాను చితకబాది ఆవును తీసుకెళ్లిపోయారు.

ఈ దాడిలో దారా నోట్లోని రెండు పళ్లు కూడా ఊడిపోయాయి. దాంతో అతను 2021 డిసెంబర్ 9న పోలీసులకు కంప్లైంట్ ఇవ్వగా… వాళ్లు కంప్లైంట్ రాయలేదు. దాంతో.. ఎస్పీని కలిశాడు. ఎస్పీ ఆదేశంతో 2021 డిసెంబర్ 21న కేసు రాశారు. పోలీసులు సరిగా దర్యాప్తు చెయ్యలేదు. దాంతో… దర్యాప్తు ఆఫీసర్, పోలీస్ స్టేషన్‌ని కూడా మార్పించారు. వేరే పోలీస్ స్టేషన్‌లో కూడా న్యాయం జరగలేదు. దాంతో దారా.. జైపూర్ డీజీపీని కలిశాడు. దాంతో కేసును దుంగర్‌గర్ పోలీస్‌స్టేషన్‌కి బదిలీ చేశారు. అక్కడా న్యాయం జరగలేదు. 2022 నవంబర్ 30న రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్.. సర్దార్ సహర్‌కి ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చారు. ఆ సమయంలో టెలిఫోన్ టవర్ ఎక్కిన దారా.. తన ఆవును తిరిగివ్వాలని డిమాండ్ చేశాడు. దాంతో తారానగర్ DSP ఓంప్రకాష్ గొడారా.. ఆవును తిరిగిస్తామని హామీ ఇచ్చారు. సర్దార్ సహర్‌లోని వెటెర్నరీ డాక్టర్‌ని కలిసిన DSP… దారా ఇంట్లో ఉన్న దూడకు DNA టెస్ట్ శాంపిల్స్ తీసుకునేలా చేశారు. ఆ దూడ తల్లే మిస్సింగ్ అయ్యింది. దుండగులు తీసుకెళ్లిన ఆవుకి కూడా శాంపిల్స్ తీసుకున్నారు. 2023 జనవరి 3న హైదరబాద్ లోని ల్యాబ్‌కి రెండు శాంపిల్సూ వెళ్లాయి. టెస్ట్ రిపోర్టులు వచ్చాయి. వాటి ప్రకారం.. ఆ ఆవు.. ఆ ఆడ దూడకు తల్లి అని తేల్చారు. దాంతో.. దారాకు ఆవును అప్పగించారు. ఈ సందర్భంగా.. ఆ ఆవుకి సంబంధించిన మరో 2 దూడలను కూడా అధికారులు గుర్తించారు. ఆవు ఫ్యామిలీ ఒక్కటవ్వడంతో… దారాతోపాటూ.. ఆయన భార్య, కూతురు కూడా ఆనందంగా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement