Tuesday, March 28, 2023

‘పుష్ప’కి కాసుల వ‌ర్షం – వారానికి ఎన్ని కోట్లో తెలుసా

పుష్ప ఈ నెల 17న రిలీజ్ అయి బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల వ‌ర్షాన్ని కురిపిస్తుంది. ఈ చిత్రాన్ని సుకుమార్ తెర‌కెక్కించాడు. కాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ర‌ష్మిక మంద‌న జంట‌గా న‌టించారు, టాలీవుడ్ హీరోయిన్ స‌మంత ఐటెం సాంగ్ లో మెరిసింది. తొలిరోజే ఆలిండియా రికార్డు నెలకొల్పుతూ రూ.71 కోట్ల గ్రాస్ రాబట్టిన పుష్ప… మొదటి వారం ముగిసేసరికి వరల్డ్ వైడ్ గా రూ.229 కోట్ల గ్రాస్ తో అదరగొట్టింది. సునీల్, అనసూయ, ఫహద్ ఫజల్ కీలకపాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -
   

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement