Friday, April 19, 2024

సుకుమార్ డైరెక్ష‌న్ లో మ‌రోసారి రామ్ చ‌ర‌ణ్

ఇప్ప‌టికే రంగ‌స్థ‌లం సినిమాతో హిట్ కొట్టారు ద‌ర్శ‌కుడు సుకుమార్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్. కాగా వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో మ‌రో చిత్రం ప‌ట్టాలెక్క‌నుంద‌ట‌. పుష్ప చిత్రం త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ తో సినిమా చేయ‌నున్న‌ట్టు చెప్పారు సుకుమార్. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో పుష్ప పార్ట్ టూ షూటింగ్ ప్రారంభం కానుంది. దీని త‌ర్వాత హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో సినిమాని తెర‌కెక్కించ‌నున్నాడు సుకుమార్. అనంత‌రం మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో సినిమా ఉంద‌ని అన్నారు. అయితే రామ్ చర‌ణ్ తో చేయాల్సిన సినిమా కథ చ‌ర్చ‌ల ద‌శ లో ఉంద‌ట‌. అయితే త‌మ కాంబినేష‌న్ లో మ‌రో సినిమా రావ‌డం ప‌క్క అని తెలిపాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement