Thursday, November 7, 2024

Unstoppable With NBK: బాలయ్య షోలో రాజమౌళి

నట సింహం నందమూరి బాలకృష్ణ ఆహాలో ‘అన్‌స్టాప‌బుల్’ అనే టాక్ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. వారం వారం కొత్త గెస్ట్ లతో ఈ షోతో అలరిస్తున్నారు. తాజాగా ఈ షోలో దర్శక ధీరుడు రాజ‌మౌళి, కీరవాణి సందడి చేశారు. రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా జనవరి 7న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ లో భాగంగా బాలయ్య షోలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన ఆసక్తి విషయాలు ఈ షోలో వెల్లడిస్తారని అభిమానులు భావిస్తున్నారు. రాజమౌళి, బాలయ్యకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. ఈ షో కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  

ఓటిటి ‘ఆహా’లో ప్రసారం అవుతున్న ఈ షోకి మంచి రెస్పాన్స్ ఉంది. ఇప్పటి వరకు ఈ షోలో మోహన్ బాబు, నాని, బ్రహ్మానందం, అనిల్ రావిపూడి, సూపర్ స్టార్ మహేష్ బాబు సందడి చేశారు. ఇటీవల అఖండ టీం కూడా కనిపించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement