Thursday, April 25, 2024

హీరోయిన్ గా పూరీ జ‌గ‌న్నాథ్ కుమారై … సొంత బ్యాన‌ర్ లోనే ..

ఇప్ప‌టికే సినీ ఇండ‌స్ట్రీలో సినీ వార‌సుల హ‌వా కొన‌సాగుతుంది. హీరోలు, హీరోయిన్స్ పిల్ల‌లే కాదు, ద‌ర్శ‌కులు ,నిర్మాత‌ల పిల్ల‌లు కూడా సినీ రంగంలో దుమ్ము రేపుతున్నారు. కాగా ఇప్పుడు వెండితెర‌కి మ‌రో సినీ వార‌సురాలు ప‌రిచ‌యం కానుంద‌నే టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ కుమారై ప‌విత్ర సినిమాలోకి అడుగుపెట్ట‌నుంద‌ట‌. ఇప్ప‌టికే ఈమె బుజ్జిగాడు చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా మెరిసింది. ఇప్పుడు హీరోయిన్ గా ప‌రిచ‌యం కానుంద‌ట‌. ఇప్ప‌టికే పూరీ కుమారుడు ఆకాష్ పూరీ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ప‌విత్ర హీరోయిన్ గా న‌టిస్తే త‌మ బ్యాన‌ర్ లోనే సినిమాలు తీస్తామ‌ని పూరీ వెల్ల‌డించిన‌ట్లు టాక్ వినిపిస్తోంది. ఏమ‌వుతుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement