Tuesday, March 26, 2024

ఆర్ ఆర్ ఆర్ – డేంజ‌ర‌స్2.0 – రామ్ గోపాల్ వ‌ర్మ‌

ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఏం మాట్లాడినా వివాద‌మే. ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ చిత్రంపై త‌న‌దైన‌శైలిలో కామెంట్స్ చేశారు. ఆర్ ఆర్ ఆర్ ప్ర‌మోష‌న్స్ లో హీరో రామ్ చరణ్, ఎన్టీఆర్ అలాగే దర్శకుడు రాజమౌళి… చాలా సరదాగా గడిపారు. స్టేజ్ పైనే గిల్లుకోవడం కూడా హైలెట్ గా నిలిచింది. ఇలా ట్రిపుల్ ఆర్ టీం పై చాలా వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే ఆర్ఆర్ఆర్ టీం నడుము గిల్లుకున్న వీడియోను ఆర్జివి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.వీరు చేసిన చేష్టలు డేంజరస్ 2.0 లాగా ఉన్నాయంటూ చురకలంటించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రామ్ గోపాల్ వర్మ తాజాగా చేసిన సినిమా డేంజరస్. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్ల మధ్య సెక్స్ జరుగుతుంది. అచ్చం అలాగే త్రిబుల్ ఆర్ టీం కూడా చేస్తుందంటూ… అర్థం వచ్చేలా ఆ వీడియోను పోస్ట్ చేశాడు రామ్ గోపాల్ వర్మ.

Advertisement

తాజా వార్తలు

Advertisement