Saturday, May 21, 2022

ద‌ర్శ‌కుడు క్రిష్ – 9అవ‌ర్స్ వెబ్ సిరీస్

డైరెక్టర్ క్రిష్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో హరి హర వీర మల్లు అనే సినిమా చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ ఫిల్మ్ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలయ్యే అవకాశముంది. కాగా 9అవ‌ర్స్ పేరుతో వెబ్ సిరీస్ ప్రేక్ష‌కుల‌ముందుకు రానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ ఈ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ వెబ్ సిరీస్ కు ప్రముఖ దర్శకుడు క్రిష్ ..షో రన్నర్ గా వ్యవహరిస్తున్నారు. తారకరత్న, అజయ్, వినోద్ కుమార్, మధు షాలినీ, రవి వర్మ, ప్రీతి అస్రానీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రాజీవ్ రెడ్డి వై, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ కు నిరంజన్ కౌషిక్, జాకోబ్ వర్గీస్ దర్శకత్వం వహించారు. పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ జూన్ 2 తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. శిక్ష అనుభవిస్తున్న ముగ్గురు ఖైదీలు ఓ భారీ దొంగతనానికి ప్లాన్ చేస్తారు. జైలు నుంచి తప్పించుకున్న వాళ్లు బ్యాంక్ లోకి ఎలా చొరబడ్డారు. అక్కడ వాళ్లు అనుకున్న ప్లాన్ వర్కవుట్ అయ్యిందా.. అనేదే క‌థ‌.
.

Advertisement

తాజా వార్తలు

Advertisement