Wednesday, March 27, 2024

దిల్ రాజు పార్టీలో – నాటు నాటుకి స్టెప్పులేసిన ‘రాజ‌మౌళి, అనిల్ రావిపూడి’

ఆర్ ఆర్ ఆర్ చిత్రం నైజాం ఏరియా డిస్ట్రిబ్యూష‌న్ హ‌క్కుల‌ను ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు తీసుకున్నారు. కాగా నైజాంలో ఆర్ ఆర్ ఆర్ భారీ వ‌సూళ్ల‌ను రాబ‌డుతోంది. దాంతో ఈ చిత్ర టీం కి దిల్ రాజు స‌క్సెస్ పార్టీని ఇచ్చారు. హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ లో ఈ పార్టీ జరిగింది. ఈ పార్టీకి తారక్, చరణ్, రాజమౌళి, మరో దర్శకుడు అనిల్ రావిపూడితో పాటు ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ సభ్యులు, ఇతర టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. పార్టీలో రాజమౌళి, అనిల్ రావిపూడి ‘నాటు నాటు’ పాటకు స్టెప్పులు వేసి అలరించారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన విజువల్ వండర్ ‘ఆర్ఆర్ఆర్’ మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అంచనాలకు తగ్గట్టుగానే ఈ చిత్రం భారీ వసూళ్లను రాబడుతూ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement