Friday, April 19, 2024

అడవిలో వజ్రాల వేట.. అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న గిరిజనులు..

ఎంత కష్టమైనా పర్వాలేదు.. ఒక్కటంటే ఒక్క వజ్రం దొరికితే చాలు.. దీనమ్మ జీవితమే మారిపోతుంది.. అంటూ కొంతమంది అదే పనిగా వజ్రాల కోట వేట కొనసాగిస్తున్నారు. మధ్య ప్రదేశ్​లోని భోపాల్​కు దాదాపు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతంలో వజ్రాల నిక్షేపాలు ఉన్నట్టు సమాచారం. అయితే అటవీశాఖ, మైనింగ్​ అధికారులు మాత్రం వారిని అడ్డుకుంటూ కేసులు పెడుతున్నారు..

పన్నా నేషనల్ పార్క్ సమీపంలోని అటవీ ప్రాంతంలో వజ్రాల కోసం వేట కొనసాగుతోంది. తమ జీవితాన్ని మార్చగల ఒకే ఒక వజ్రాన్ని దొరకబుచ్చుకోవాలనే ఆశతో ప్రజలు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయితే విలువైన రాళ్ల అక్రమ మైనింగ్‌ను అరికట్టడానికి అటవీ శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. కాగా, ఈ మధ్య జరిపిన దాడిలో మైనింగ్‌లో పాల్గొన్న వ్యక్తులు తప్పించుకోగా.. 37 బైక్​లు, డైమండ్ గనులు తవ్వడానికి ఉపయోగించే పరికరాలను పెద్ద ఎత్తున పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈశాన్య మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు దాదాపు 400 కిలోమీటర్ల దూరంలోని దేశంలోని ఏకైక వజ్రాల ఉత్పత్తి ప్రాంతంలో అక్రమ మైనింగ్ పెద్ద ఎత్తున కొనసాగుతోంది. బుందేల్‌ఖండ్ ఏరియాలోని వింధ్య శ్రేణిలో అడవులు, పొలాలు, ప్రభుత్వ భూమిల్లో వజ్రాల నిక్షేపాలు కనిపిస్తాయి. రన్జ్ నది ఎండిపోయినప్పటి నుండి కొన్ని సంవత్సరాలుగా వేటగాళ్లు వజ్రాలను కనుగొనడానికి తవ్వకాలు చేపడుతున్నారు. పన్నాలోని నార్త్ ఫారెస్ట్ డివిజన్‌లోని విశ్రమ్‌గంజ్ ఫారెస్ట్ సర్కిల్‌లోని గనుల ప్రాంతంలో ప్రజలు రోజూ వజ్రాల కోసం తవ్వుతుంటారు. ఇక్కడి భూములను స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ రాష్ట్ర ప్రభుత్వం రంజ్ నదిపై కాంపోజిట్ డ్యామ్‌ను నిర్మిస్తోంది.  

Advertisement

తాజా వార్తలు

Advertisement