శబరిమల అయ్యప్ప స్వామికి ఏపీకి చెందిన ఓ భక్తుడు వజ్రాల కిరీటాన్ని విరాళంగా ఇచ్చారు. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన మారం వెంకటసుబ్బయ్య శబరిమల అయ్యప్ప స్వామికి వజ్రాలతో పొదిగిన బంగారు కిరీటం బహుకరించారు. శుక్రవారం శబరిమల ఆలయంలో కేరళ హైకోర్టు న్యాయవాది సాయంతో కిరీటాన్ని శబరిమల ఆలయ ప్రధాన అర్చకుడికి అందజేశారు. గతేడాది కరోనా బారిన పడిన సమయంలో తాము కోలుకోవాలని వెంకటసుబ్బయ్య మొక్కుకున్నారు. ప్రస్తుతం ఆ మొక్కులో భాగంగా కిరీటాన్ని బహుకరించారు. అయితే ఆ కిరీటం వెల ఎంత అనేది వెల్లడించలేదు.
Sabarimala: అయ్యప్ప స్వామికి వజ్రాల కిరీటం.. ఏపీ భక్తుడు విరాళం

Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement