Friday, March 29, 2024

న్యూ లుక్ లో ధోని – కోర మీసాల‌తో అదిరాడుగా

క్రికెట‌ర్ ధోని స్టైల్ కి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు..ఆయ‌న ఆట‌తో పాటు ధోని స్టైల్ ని ఇష్ట‌ప‌డుతుంటారు జ‌నం.కాగా
ధోనీ న్యూ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ.. ఈ ఏడాది రాబోయే ఐపీఎల్ మెగా టోర్నీలోనూ మరోసారి చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఛాంపియన్‌గా నిలబెట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. అయితే, అంతకన్నా ముందు ధోనీ ఓ ప్రోమోలో కనిపించాడు. ‘స్టార్‌ స్పోర్ట్స్‌ ఇండియా’ తాజాగా ఆ టీజర్‌ను విడుదల చేసింది. అందులో ధోనీ, ఖాకీ రంగు దుస్తులు ధరించి బస్సు డ్రైవర్‌గా కనిపించాడు. ఈ కొత్త లుక్‌ ఎలా ఉందో తెలపాలంటూ స్టార్ స్పోర్ట్స్ అభిమానుల అభిప్రాయాలు కోరింది. కాగా అభిమానుల నుంచి నుంచి విశేషమైన స్పందన వస్తోంది. అచ్చం చెన్నై బ‌స్ డ్రైవ‌ర్ ల క‌నిపించే విధంగా మాస్ లుక్ తో ఉన్నాడు. కోర మీసాల‌తో ధోనిని చూసి అభిమానులు పండ‌గ చేసుకుంటున్నారు. కాగ ఐపీఎల్ 2022 మార్చి 26 నుంచి ప్రారంభం కాబోతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement