Wednesday, November 6, 2024

Danush: శివశంకర్ మాస్టర్ కు ధనుష్ సాయం

కరోనా బారిన పడి ప్రాణాపాయస్థితిలో ఉన్న ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ శివశంకర్ కు ప్రముఖులు ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఇప్పటికే నటుడు సోను సూద్ చేయూత ఇవ్వగా.. తాజాగా తమిళ స్టార్ హీరో ధనుష్ కూడా ముందుకు వచ్చారు. శివశంకర్ మాస్టర్ వైద్య ఖర్చుల నిమిత్తం ఏకంగా రూ.10లక్షల ఆర్థిక సాయం చేశారు. శివశంకర్ మాస్టర్ త్వరగా కోలుకోవాలని ధనుష్ ఆకాంక్షించారు.

కాగా, కరోనా సోకడం వల్ల శివ శంకర్ మాస్టర్ ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది. గత ఐదు రోజులుగా శివశంకర్‌కు మాస్టర్ హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం మాస్టర్ ఊపిరితిత్తులకు ఇన్ ఫెక్షన్ సోకడంతో ఆయన పరిస్థితి అత్యంత విషమంగా మారింది. దీంతో చికిత్సకు తగిన డబ్బు సహాయం చేయమని శివశంకర్ కుటుంబ సభ్యులు దాతల సాయం కోరారు. ఇది తెలుసుకున్న నటుడు సోనూసూద్ ఆయనకు అండగా ఉంటానని మాటిచ్చారు. వైద్యానికి తగు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు కోలీవుడ్ హీరో ధనుష్ కూడా నేనున్నానంటూ ముందుకు వచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement